వాట్సాప్ సేవల పునరుద్ధరణ..
- October 25, 2022
ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన వాట్సాప్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే, ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ తిరిగి పని చేస్తుందా… లేక కొన్ని దేశాల్లో మాత్రమే పనిచేస్తుందా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.
మంగళవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయం నుంచి ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. దాదాపు అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి. ఈ విషయంపై ట్విట్టర్ సహా అనేక మాధ్యమాల్లో యూజర్లు ఫిర్యాదు చేశారు. తమ అసహనం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన వాట్సాప్ మాతృసంస్థ ‘మెటా’ సేవలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది. దాదాపు రెండు గంటల తర్వాత నుంచి వాట్సాప్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం రెండున్నర గంటల లోపు సేవలు ప్రారంభమయ్యాయి.
కాగా, ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లోనూ సమస్య తలెత్తినట్లు సమాచారం. ప్రస్తుతానికి సేవలు ప్రారంభమైనప్పటికీ, అన్ని దేశాల్లో సేవలు మొదలయ్యాయో లేదో తెలీదు. అయితే, వాట్సాప్ సేవలు నిలిచిపోవడానికి గల కారణాలను ఆ సంస్థ అన్వేషిస్తోంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ నుంచి గోవా సూపర్ హైవే రానుంది
- మక్కాలోని మస్జిద్ అల్-హరామ్ పై నుండి దూకిన వ్యక్తి..!!
- అబుదాబిలో ఇంట్లో చలిమంటలు..ఐదుగురికి అస్వస్థత..!!
- బహ్రెయిన్–యూఏఈ మధ్య సంయుక్త సమావేశం..!!
- అమెరాట్లో ప్రమాదకరమైన స్టంట్స్.. డ్రైవర్ అరెస్ట్..!!
- 2025 ఫిడే ప్రపంచ రాపిడ్, బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లు ప్రారంభం..!!
- కువైట్ లో ఎనర్జీ డ్రింక్స్ పై నిషేధం..!!
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్‌లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్







