దీపావళి వేడుకల్లో పాల్గొన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్
- October 27, 2022
లండన్: బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ మంగళవారం బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బుధవారం రాత్రి 10 డౌనింగ్ స్ట్రీట్లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో రిషి సునాక్ పాల్గొన్నారు. ముందుగా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… బ్రిటన్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. దీపావళి వేడుకల్లో పాల్గొన్న ఫోటోను కూడా షేర్ చేశారు.
బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. భారతావని దీపావళి పండుగ సంబురాలు జరుపుకుంటుండగా బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ స్థానానికి పోటీ పడిన పెన్నీ మోర్డాంట్ వైదొలగడంతో బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన తొలి భారత సంతతి నేతగా రికార్డు సృష్టించారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







