దుబాయ్ లో చిక్కుకున్న నిజామాబాద్ యువకులను స్వదేశానికి రప్పించిన కేటీఆర్
- October 28, 2022
హైదరాబాద్: మంత్రి కేటీఆర్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఎవరు ఏ ఆపదలో ఉన్న వారిని రక్షించే కేటీఆర్..తాజాగా దుబాయ్ లో చిక్కుకున్న నిజమాబాద్ యువకులను స్వదేశానికి రప్పించారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆరుగురు యువకులు ఇటీవల దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో చిక్కున్నారు.స్వదేశానికి రప్పించాలని పదిహేను రోజుల క్రితం మంత్రి కేటీఆర్‌ను సోషల్ మీడియా ద్వారా కోరారు.దీంతో స్పందించిన కేటీఆర్.. దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ అధికారులతో మాట్లాడి.. తన సొంత ఖర్చుతో ఆ యువకులు స్వదేశానికి వచ్చే ఏర్పాట్లు చేశారు.
గురువారం అర్ధరాత్రి సమయంలో వారు క్షేమంగా భారత్ చేరుకున్నారు.శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆ యువకులను..బంజారా సంఘం జిల్లా అధ్యక్షుడు గుగులోత్ సురేష్ నాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి తదితరులు కలుసుకున్నారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం యువకులను ప్రత్యేక వాహనంలో స్వగ్రామానికి పంపించారు.ఈ సందర్బంగా ఆ యువకులు కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్







