పాదచారుల వంతెనపై బైక్ రైడింగ్.. బహిష్కరణ వేటు

- October 28, 2022 , by Maagulf
పాదచారుల వంతెనపై బైక్ రైడింగ్.. బహిష్కరణ వేటు

కువైట్: పాదచారుల వంతెనను ఉపయోగించిన మోటార్‌సైకిల్‌దారులను బహిష్కరించాలని అంతర్గత మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ద్విచక్రవాహనదారులు పాదచారుల వంతెనను చట్టవిరుద్ధంగా ఉపయోగిస్తున్నారని, ఇది వారి జీవితాలతోపాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడవేస్తుందన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే ద్విచక్రవాహనదారులను పట్టుకొని బహిష్కరిస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది. హింసాత్మక సంఘటనల్లో పాల్గొనే ప్రవాసులను బహిష్కరించాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com