పోలీసుల అదుపులో డ్రగ్ డీలర్ ‘ది బ్యాట్’
- October 28, 2022
దుబాయ్: 10 రోజులపాటు నిర్వహించిన ఆపరేషన్‌లో 'ది బ్యాట్' అనే పేరుమోసిన డ్రగ్ డీలర్‌ను అరెస్టు చేసినట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎమిరేట్‌లో మారువేషంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ డ్రగ్ డీలర్లలో 'ది బ్యాట్' ఒకరు. అతను ఒక ప్రధాన అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్‌లో ప్రధానంగా ఉన్నాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా యూఏఈలో డ్రగ్స్ విక్రయించి ప్రచారం చేసే క్రిమినల్ ముఠాలో అతనిది రెండవ అతిపెద్ద నెట్ వర్క్. దాదాపు 200 కిలోలు డ్రగ్స్ ను అతని నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యాంటీ నార్కోటిక్స్ అధికారులు అనేక మంది ఆసియా డీలర్లను అరెస్టు చేసి.. వారిచ్చిన సమాచారంతో దుబాయ్‌లో డ్రగ్ డీలర్ ‘బ్యాట్’ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు యాంటీ నార్కోటిక్స్ జనరల్ డిపార్ట్‌మెంట్ యాక్టింగ్ డైరెక్టర్ బ్రిగేడియర్ ఖలీద్ బిన్ మువైజా తెలిపారు. ఆపరేషన్ కోసం ఏర్పాటైన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ అతడిని గుర్తించిన సమయంలో ‘ది బ్యాట్’ మాదకద్రవ్యాల బానిసగా నటించి తప్పించుకునే ప్రయత్నం చేశాడని మువైజా వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్‌కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్‌లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్‌లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







