సంక్రాంతి పోటీ మామూలుగా లేదుగా.!

- October 29, 2022 , by Maagulf
సంక్రాంతి పోటీ మామూలుగా లేదుగా.!

ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పెద్ద పోరే జరగనుంది. నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ కానున్నాయ్. అందులో ప్రబాస్ నటిస్తున్న ‘ఆది పురుష్’ ప్యాన్ ఇండియా సినిమా అన్న సంగతి తెలిసిందే.
అలాగే, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేర్ వీరయ్య’, బాలయ్య నటిస్తున్న ‘వీర సింహారెడ్డి’ సినిమాలు కూడా ఈ సీజన్‌లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయ్.
అలాగే అక్కినేని హీరో అఖిల్ ‘ఏజెంట్’ సినిమాతో రాబోతున్నాడు ఇదే సీజన్‌లో. వీటితో పాటూ, తమిళ హీరో విజయ్ నటిస్తున్న ‘వారసుడు’, అజిత్ నటిస్తున్న సినిమా ఒకటి ఇదే సీజన్‌కి బాక్సాఫీస్ వద్ద తలపడేందుకు సిద్ధమవుతున్నాయ్.
కాగా, వీటిలో ప్రబాస్ సినిమా ప్యాన్ ఇండియా సినిమా. చిరు, బాలయ్య స్ర్టెయిట్ తెలుగు మూవీస్‌తో వస్తున్నారు. అఖిల్ ‘ఏజెంట్’ కూడా ప్యాన్ ఇండియా రేంజే. కానీ, తెలుగులో తప్ప పెద్దగా బజ్ లేదు ఈ సినిమాకి. 
ఇక, విజయ్ నటిస్తున్న ‘వారసుడు’ సినిమాని బైలింగ్వల్‌గా అభివర్ణిస్తున్నారు. కానీ, ఆ సినిమాని తమిళ సినిమా లిస్టులోనే పడేశారు. అజిత్ సంగతి చెప్పనే అక్కర్లేదు. ఏది ఏమైనా ఈ సారి సంక్రాంతి‌కి పోటీ మస్త్ రంజుగా వుండబోతోందని సినీ ఫ్యాన్స్ ఆసక్తిగా వున్నారు. అయితే వీటిలో ఎన్ని సినిమాలు ఆ టైమ్‌కి సీన్‌లో వుంటాయో, ఎన్ని లేచిపోతాయో.. అది కూడా ఆసక్తికరమే సుమీ.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com