నిఖిల్‌కి లక్కు కాలం ఇదే.! మళ్లీ వచ్చేస్తున్నాడహో.!
- October 29, 2022
‘కార్తికేయ 2’ సినిమాతో 100 కోట్లు కొల్లగొట్టాడు యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ద్. అంతేకాదు, ప్యాన్ ఇండియా హీరో అయిపోయాడు కూడా ఈ సినిమాతో నిఖిల్.
రిలీజై చాలా కాలమే అయినా, ఈ సినిమా గురించి ఇంకా చర్చ జరుగుతూనే వుంది. కాగా, ఇదే టైమ్‌లో నిఖిల్ నటించిన మరో సినిమా ‘18 పేజెస్’ని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించింది. డిశంబర్ 23న ‘18 పేజెస్’ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అన్నట్లు ఈ సినిమాలోనూ అనుపమా పరమేశ్వరనే హీరోయిన్గా నటిస్తోంది. సో, ఇద్దరికీ ఈ సినిమా మరో మంచి బ్రేక్ ఈవెన్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకి కథను అందించగా, అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. పెద్ద తలకాయల ప్రమేయం వున్నందున ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయ్. దానికి ‘కార్తికేయ 2’తో నిఖిల్ సాధించుకున్న ఇమేజ్ కూడా తోడైంది. సో, ‘18 పేజెస్’తో నిఖిల్ మరో హిట్ తన ఖాతాలో వేసుకోనున్నాడేమో చూడాలి మరి.
తాజా వార్తలు
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్‌లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం







