తమన్నా పెళ్లి కబురు అతి త్వరలోనే.!

- October 29, 2022 , by Maagulf
తమన్నా పెళ్లి కబురు అతి త్వరలోనే.!

మిల్కీ బ్యూటీ తమన్నా త్వరలో పెళ్లి చేసుకోబోతోందా.? అంటే అవుననే అంటున్నాయ్ టాలీవుడ్ వర్గాలు. మొన్నీ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో పెళ్లి, పిల్లలు గురించి ఒకింత ఆసక్తికరంగా మాట్లాడింది తమన్నా. 
అయితే, పెళ్లెప్పుడు.? అని అడిగితే మాత్రం దానికి ఇంకా టైముందని ఎస్కేప్ అయిపోయింది. కానీ, తమన్నా త్వరలో పెళ్లి చేసుకోనుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం. 
ఇంట్లో తమన్నాకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారనీ తెలుస్తోంది. అలాగే, తనకు నచ్చిన పెళ్లికొడుకు కోసం తమన్నా కూడా వేటాడుతోందనీ అంటున్నారు. అంటే, త్వరలోనే తమన్నా పెళ్లి కబురు చెప్పబోతోందన్న మాట.
మరోవైపు తమన్నా వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. రీసెంట్‌గా ‘బబ్లీ బౌన్సర్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది తమన్నా. అలాగే, ప్రస్తుతం ‘భోళా శంకర్’ సినిమాలో తమన్నా నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో తమన్నా, చిరుతో రొమాన్స్ చేస్తుండగా, కీర్తి సురేష్, మెగాస్టార్‌కి చెల్లెలి పాత్రలో నటిస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com