VAT నిబంధనల్లో సవరణలు చేసిన యూఏఈ

- October 29, 2022 , by Maagulf
VAT నిబంధనల్లో సవరణలు చేసిన యూఏఈ

యూఏఈ: 2023 జనవరి 1 నుండి అమలులోకి వచ్చే వాల్యూ యాడెడ్ టాక్స్ (VAT)పై ఫెడరల్ డిక్రీ-లా నెం. 8 (2017)లోని కొన్ని నిబంధనలకు యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ సవరణలు చేసింది. మెరుగైన అంతర్జాతీయ విధానాలు, జీసీసీ ఏకీకృత VAT ఒప్పందాలు, వివిధ వ్యాపార రంగాలు నుంచి అందిన సిఫార్సుల ఆధారంగా సవరణలు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. పన్ను పరిధిలోకి వచ్చే వస్తువుల సరఫరా,  జీరో-రేటింగ్‌ టాక్స్ పరిధి,  VAT రిజిస్ట్రేషన్  మినహాయింపు కోసం దరఖాస్తు విధానము,  పన్ను ఇన్‌వాయిస్‌లను జారీ వ్యవధి, అవుట్‌పుట్ పన్నును సెటిల్ చేయడానికి పన్ను క్రెడిట్ నోట్‌ జారీ,  ఫెడరల్ టాక్స్ అథారిటీ (FTA) పరిధులకు సంబంధించిన పలు అంశాలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ సవరణలు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com