ట్రాఫిక్ అలర్ట్: కొన్ని దుబాయ్ రోడ్లలో ఆలస్యాన్ని ఆశించవచ్చు
- October 30, 2022
యూఏఈ : అక్టోబర్ 30న ( ఆదివారం) జరగనున్న దుబాయ్ సిటీ హాఫ్ మారథాన్ కారణంగా కొన్ని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతుందని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. వాహనదారులు అల్ ముస్తక్బాల్ స్ట్రీట్, అల్ ఓమ్లాత్ స్ట్రీట్, అల్ సుకౌక్ స్ట్రీట్లలో ఉదయం 6 నుండి 8 గంటల వరకు నెమ్మదిగా సాగుతుందని అంచనా వేసింది. ఈ మార్గాల గుండా వెళ్లేటప్పుడు డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని, ట్రాఫిక్ సైన్ బోర్డులను అనుసరించాలని అధికార యంత్రాంగం కోరింది.
మై దుబాయ్ సిటీ హాఫ్ మారథాన్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్లోని గేట్ బిల్డింగ్ వద్ద ప్రారంభమవుతుంది. బుర్జ్ ఖలీఫా, ఎమిరేట్స్ టవర్స్, మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ గుండా వెళుతుంది. నివాసితులు 21km, 5km లేదా 10km సర్క్యూట్లో పాల్గొనవచ్చు. ఈవెంట్లో 16 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చని నిర్వాహకులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్‌లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్
- హైదరాబాద్ లో భానుడి భగభగలు
- పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!









