నకిలీ వీసాపై కెనడాకు.. వ్యక్తికి జైలుశిక్ష

- October 30, 2022 , by Maagulf
నకిలీ వీసాపై కెనడాకు.. వ్యక్తికి జైలుశిక్ష

దుబాయ్‌: నకిలీ వీసా ద్వారా కెనడాకు వెళ్లేందుకు ప్రయత్నించినందుకు ఒక ఆసియా వ్యక్తికి దుబాయ్‌లోని కోర్ట్ ఆఫ్ మిస్డిమీనర్స్ ఒక నెల జైలు శిక్ష విధించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. గత సెప్టెంబర్‌లో దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లోని ఇమ్మిగ్రేషన్ అధికారి కెనడాకు వెళ్లాలని భావించిన ఆసియన్ పాస్‌పోర్ట్‌లో నకిలీ వీసా స్టాంప్‌ను గుర్తించింది. వీసా నకిలీదని నిర్ధారించిన తర్వాత సదరు ప్రయాణికుపై కేసు నమోదు చేసి ప్రాసిక్యూషన్ అధికారులకు కేసును బదిలీ చేశారు. నిందితుడు పొరుగు దేశంలోని టూరిజం కార్యాలయం నుండి 10,000 దిర్హామ్‌లకు కెనడాకు వెళ్లడానికి వీసా పొందాడని, అది నకిలీదని తనకు తెలియదని విచారణలో సదరు వ్యక్తి చెప్పాడు. కోర్టు అతడిని దోషిగా నిర్ధారించి జైలు శిక్షను విధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com