దోపిడీలు, చైన్ స్నాచింగ్‌ కేసులో మహిళకు 3 ఏళ్ల జైలుశిక్ష

- October 30, 2022 , by Maagulf
దోపిడీలు, చైన్ స్నాచింగ్‌ కేసులో మహిళకు 3 ఏళ్ల జైలుశిక్ష

బహ్రెయిన్ : దోపిడీలకు పాల్పడిన 32 ఏళ్ల మహిళకు పడ్డ మూడేళ్ల జైలు శిక్షను బహ్రెయిన్ కాసేషన్ కోర్టు ఖరారు చేసింది. అంతకుముందు తీర్పుకు వ్యతిరేఖంగా నిందితురాలు దాఖలుచేసిన అప్పీల్‌ను కొర్టు తిరస్కరించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఆసియన్ జాతీయుడి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు అరబ్ జాతీయురాలైన మహిళను అరెస్ట్ చేశారు. మనమా, ముహరఖ్‌లలో నమోదైన పలు దొంగతనాలలో ఆ మహిళ ప్రమేయాన్ని దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు ఛార్జ్ షీట్‌లు స్పష్టం చేశాయి. ఆమె చాలా మంది వ్యక్తులను మోసం చేయడంతోపాటు రెండు గవర్నరేట్‌లలోని అనేక దుకాణాలలో దొంగతనం చేసిందని పోలీసులు నిర్ధారించారు. 2021 అక్టోబరు 15లో బాధితురాలు తొలిసారి బంగారు చైన్ స్నాచింగ్ కు పాల్పడిందని పోలీసులు వెల్లడించారు. జైలు శిక్ష పూర్తయిన తర్వాత ఆ మహిళను రాజ్యం నుంచి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com