అబుధాబి BAPS హిందూ మందిర్ లో ఘనంగా దీపావళి వేడుకలు

- October 31, 2022 , by Maagulf
అబుధాబి BAPS హిందూ మందిర్ లో ఘనంగా దీపావళి వేడుకలు

అబుధాబి: BAPS హిందూ మందిర్‌లో వరుసగా మూడవ సంవత్సరం దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు దాదాపు 10,000 మంది సందర్శకులు హాజరయ్యారు. ఉదయం 11.00 గంటలకు ప్రారంభమైన వేడుకలు రోజంతా ఆహ్లాదకర వాతావరణంలో కొనసాగాయి. యూఏఈ టోలరెన్స్, కోఎగ్జిటెన్స్ మినిస్టర్ షేక్ నహ్యాన్ మబారక్ అల్ నహ్యాన్ సహా వందలాది మంది ప్రముఖులు ఈ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి చిహ్నంగా దీపావళిని జరుపుకుంటారని ఈ సందర్భంగా BAPS మిడిల్ ఈస్ట్ అధిపతి పూజ్య బ్రహ్మవిహారి స్వామి వివరించారు. ఈ కార్యక్రమానికి యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్, యూఏఈలోని రిపబ్లిక్ ఆఫ్ పరాగ్వే రాయబారి జోస్ అగ్యురో అవిలా తదితరలు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com