బహ్రెయిన్ లో 4 శాతానికి చేరిన వార్షిక ద్రవ్యోల్బణం

- October 31, 2022 , by Maagulf
బహ్రెయిన్ లో 4 శాతానికి చేరిన వార్షిక ద్రవ్యోల్బణం

బహ్రెయిన్ : 2022 సెప్టెంబరులో వార్షిక ద్రవ్యోల్బణం రేటు 4 శాతానికి చేరింది. ఇది 2013 డిసెంబరు నుండి అత్యధికం కావడం గమనార్హం. ద్రవ్యోల్బణాన్ని నిర్ణయించే వాటిల్లో ఆహారం & మద్యపాన రహిత పానీయాలు 10.7% (ఆగస్టులో 10.4%), ఆల్కహాలిక్ పానీయాలు & పొగాకు 13.4%(మార్పులేదు), రెస్టారెంట్లు & హోటళ్లు13.4(ఆగస్టులో 15.1%), రవాణా 8.1% (ఆగస్టులో 6.5%) పెరుగుదల నమోదైంది. కాగా, దుస్తులు & పాదరక్షల ధరలు -9.3%(ఆగస్టులో -8.9%), హౌసింగ్ & యుటిలిటీస్ -0.7% (ఆగస్టులో -0.9%)లో తగ్గుదల కనిపించింది. నెలవారీ ప్రాతిపదికన.. వినియోగదారు ధరలు ఆగస్టు నెలలో 0.2% ఉండగా.. సెప్టెంబర్ లో అవి 0.3 శాతానికి  పెరిగాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com