వ్యక్తిపై దాడి.. ముగ్గురు వ్యక్తులకు ఏడాది జైలు, Dh3,500 జరిమానా
- November 02, 2022
దుబాయ్: నైఫ్‌లో పనిచేస్తున్న ఉద్యోగిపై దాడి చేసి 3,500 దిర్హామ్‌లు దొంగిలించినందుకు ముగ్గురు వ్యక్తుల కోర్టు దోషులుగా నిర్ధారించింది. నిందితులకు ఒక సంవత్సరం జైలు శిక్ష, జరిమానా(దొంగతనం చేసిన Dh3,500) విధించింది. నిందితులు శిక్షను అనుభవించిన తర్వాత దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది. ఈ మేరకు అప్పీల్ కోర్టు తీర్పును సమర్థించింది.కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఈ కేసు గత డిసెంబర్లో జరిగింది. నైఫ్‌లో నడుచుకుంటూ వెళుతుండగా తనపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారని ఆసియన్ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు డబ్బులు డిమాండ్ చేశారని బాధితుడు చెప్పాడు. అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారు తనపై కత్తులతో దాడి చేశారని బాధితుడు పేర్కొన్నాడు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. దుబాయ్ పోలీసుల దర్యాప్తు బృందం ఆధారాలు సేకరించి నిందితులను అరెస్టు చేసింది. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







