ఏడాదిలో రెండుసార్లు ఖర్జూర ఫెస్టివల్..!

- November 02, 2022 , by Maagulf
ఏడాదిలో రెండుసార్లు ఖర్జూర ఫెస్టివల్..!

మస్కట్ : ఖర్జూర ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి అనేక అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాలని,  ముఖ్యంగా COVID-19 మహమ్మారి తర్వాత ఖర్జూర రైతులు, అనుబంధ వ్యాపారాలలో పాల్గొన్నవారు సంవత్సరానికి రెండుసార్లు ఖర్జూర ఫెస్టివల్ ని నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో 8వ ఒమానీ డేట్స్ ఫెస్టివల్ సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇది నవంబర్ 6 వరకు కొనసాగుతుంది. సఫా అల్ బహెర్ డేట్స్ కంపెనీకి చెందిన ఖలీద్ అల్ జడ్జాలీ మాట్లాడుతూ.. ఖర్జూర పరిశ్రమకు మద్దతు ఇవ్వడానికి ఖర్జూర ఫెస్టివల్ ని సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించాలని కోరారు. సంవత్సరానికి ఒకటి కంటే ఎక్కువసార్లు ఖర్జూర ఫెస్టివల్ ని నిర్వహించాలని, ఇది చిన్న, మధ్య తరహా పరిశ్రమల యజమానులకు మద్దతుగా ఉంటుందని కరమ్ ప్యాలెస్ ట్రేడింగ్ కంపెనీకి చెందిన హమిదా సెయిద్ అల్ ఎస్రీ, వైలెట్ ఫర్ డేట్స్, చాక్లెట్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ అస్మా అల్ మహదీ, గిఫ్టింగ్ గార్డెన్ కంపెనీ యజమాని ఇబ్రహీం సయీద్ అల్ అబ్రి, టామ్రాటీ కంపెనీ జనరల్ మేనేజర్ మొహమ్మద్ అహ్మద్ అల్ సవాఫీ లతోపాటు మరికొందరు ఖర్జూర ఫెస్టివల్ లో పాల్గొంటున్న వ్యాపారులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com