బహ్రెయిన్ పబ్లిక్ బస్ నెట్‌వర్క్ విస్తరణ

- November 02, 2022 , by Maagulf
బహ్రెయిన్ పబ్లిక్ బస్ నెట్‌వర్క్ విస్తరణ

బహ్రెయిన్: నవంబర్ 6 నుండి బహ్రెయిన్‌లోని అన్ని ప్రాంతాలకు సేవలందించేందుకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్ నెట్‌వర్క్‌ ని విస్తరించి.. కొత్త లైన్‌లను ఏర్పాటు చేయనున్నట్లు రవాణా, కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ముహరక్ గవర్నరేట్, ఇసా టౌన్, సల్మాన్ సిటీ, బుదయ్యా, సార్‌లోని అన్ని పట్టణాలతోపాటు అదనంగా మనామా, సిత్రా, రిఫా, సదరన్ గవర్నరేట్ కోసం పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్ కవరేజీలు కొత్త ప్రణాళికలో భాగంగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ల్యాండ్ ట్రాన్స్‌పోర్ట్ ప్లానింగ్ అండ్ స్టడీస్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ హుస్సేన్ అలీ యాకూబ్ మాట్లాడుతూ.. బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ సమన్వయంతో వినియోగదారుల ప్రయాణాలను సులభతరం చేయడానికి ప్రజా రవాణా సేవలను అందించడానికి మంత్రిత్వ శాఖ కృషి చేస్తుందని తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన అనుభవాన్ని కల్పించుందకు మొబైల్ ఇంటర్నెట్ సేవలు, మహిళలకు ప్రత్యేక సీట్లను ఏర్పాటు చేశామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com