క్రికెట్ ఆడిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
- November 02, 2022
హైదరాబాద్: భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ సరదాగా క్రికెటర్ అవతారమెత్తాడు. 5తరగతి చదివే బాలుడు యశోవర్ధన్ లో కలిగి హైదరాబాద్ పటాన్ చెరువు వద్ద క్రికెట్ ఆడారు. రాహుల్ బౌలింగ్ వేయగా యశోవర్ధన్ బ్యాటింగ్ ఆడాడు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, సంపత్ కుమార్ ఇతరులు ఫీల్డింగ్ చేశారు.అయితే అంతకు ముందు రాహుల్ కు ఆ బాలుడు మధ్యతరగతి ప్రజలకు భారమైన ప్రైవేటు విద్య పై వినతిపత్రం అందచేశాడు.మీరు ప్రధాని అయితే ప్రైవేట్ స్కూలు ఫీజులపై ప్రభుత్వ అజమాయిషీ ఉండేలా చూడాలని ..ప్రభుత్వ పాఠశాలలను పటిష్టపరచాలని కోరారు.సానుకూలంగా స్పందించిన రాహుల్ ఆ అబ్బాయి క్రికెట్ బ్యాట్ పై ఆటోగ్రాఫ్ చేశారు.దీంతో కొద్దిసేపు ఆ ప్రాంతమంతా కొలాహలంతో నిండింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







