తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారం...
- November 02, 2022
భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అద్భుతమైన అవకాశాన్ని ఇస్తోంది.ఎస్‌బీఐ ఏటీఎం ఫ్రాంఛైజ్ తీసుకొని నెలకు రూ.60,000 నుంచి రూ.70,000 వరకు ఈజీగా సంపాదించవచ్చు.ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు.ఇంట్లో కూర్చొని ప్రతీ నెలా ఆదాయాన్ని పొందొచ్చు.బ్యాంకులు ఏటీఎంలు ఏర్పాటు చేసే బాధ్యతల్ని కొన్ని సంస్థలకు అప్పగిస్తుంటాయి.ఆ సంస్థలు వేర్వేరు ప్రాంతాల్లో ఏటీఎంలను ఏర్పాటు చేస్తుంటాయి.ఈ ఏటీఎంలు ఏర్పాటు చేయడానికి ఫ్రాంఛైజ్ తీసుకోవచ్చు.
టాటా ఇండీక్యాష్, ముత్తూట్ ఏటీఎం, ఇండియా వన్ ఏటీఎం లాంటి సంస్థలు ఏటీఎం ఫ్రాంఛైజ్‌లు ఇస్తుంటాయి.ఈ ఫ్రాంఛైజ్ ఎవరైనా తీసుకోవచ్చు.మీరు ఎస్‌బీఐ ఏటీఎం ఫ్రాంఛైజ్ తీసుకోవాలనుకుంటే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.అయితే ఏటీఎం ఫ్రాంఛైజ్ తీసుకోవడానికన్నా ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.
ఏటీఎం ఫ్రాంఛైజ్ కోసం ఇవి తప్పనిసరి
ఏటీఎం ఏర్పాటు చేయడానికి 50 నుంచి 80 చదరపు అడుగుల స్థలం ఉండాలి.మీరు ఏటీఎం ఏర్పాటు చేయాలనుకున్న ప్రాంతం నుంచి 100 మీటర్ల దూరంలో ఏటీఎంలు ఉండకూడదు. ప్రజలకు సులువుగా కనిపించే ప్రాంతంలో ఏటీఎం ఉండాలి. 24 గంటలపాటు పవర్ సప్లై ఉండాలి.1kW ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తప్పనిసరి.కాంక్రీట్ రూఫ్ తప్పనిసరి.వీ-శాట్ ఏర్పాటు చేయడానికి సొసైటీ లేదా సంబంధిత అధికారుల నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలి.
ఏటీఎం ఫ్రాంఛైజ్ కోసం కావాల్సిన డాక్యుమెంట్స్
1. ఐడీ ప్రూఫ్ - ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ , ఓటర్ కార్డ్.
2. అడ్రస్ ప్రూఫ్ - రేషన్ కార్డ్, విద్యుత్ బిల్లు.
3. బ్యాంక్ అకౌంట్, పాస్‌బుక్.
4. ఫోటోగ్రాఫ్, ఇ-మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్.
5. ఇతర పత్రాలు.
6. జీఎస్‌టీ నెంబర్.
7. ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్.
ఏటీఎం ఫ్రాంఛైజ్ కోసం అప్లై చేయాల్సిన వెబ్‌సైట్స్
టాటా ఇండీక్యాష్- http://www.indicash.co.in
ముత్తూట్ ఏటీఎం- http://www.muthootatm.com/suggest-atm.html
ఇండియా వన్ ఏటీఎం- http://india1atm.in/rent-your-space
ఆదాయం ఇలా
ఎస్‌బీఐ ఏటీఎం ఫ్రాంఛైజ్‌లు అందిస్తున్న అతిపెద్ద కంపెనీ టాటా ఇండీక్యాష్.రూ.2,00,000 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించి ఏటీఎం ఫ్రాంఛైజ్ తీసుకోవచ్చు.ఈ సెక్యూరిటీ డిపాజిట్ రీఫండబుల్.దీంతో పాటు రూ.3,00,000 వర్కింగ్ క్యాపిటల్ కావాలి.మొత్తం పెట్టుబడి రూ.5,00,000 అవుతుంది.ఈ ఏటీఎంలో ప్రతీ క్యాష్ ట్రాన్సాక్షన్‌కు రూ.8, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్‌కు రూ.2 చొప్పున కమిషన్ లభిస్తుంది.ఉదాహరణకు రోజూ 500 ట్రాన్సాక్షన్స్ జరిగాయనుకుందాం. అందులో 250 క్యాష్ ట్రాన్సాక్షన్స్, 250 నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉంటే రోజూ రూ.2,500 చొప్పున రూ.75,000 వరకు కమిషన్ వస్తుంది.ట్రాన్సాక్షన్స్ తక్కువగా ఉంటే కమిషన్ తక్కువ ఉంటుంది. అయితే రద్దీ ఎక్కువగా ఉండే ఏరియాలో ఏటీఎం ఏర్పాటు చేస్తే ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







