అప్పుల బాటలో సౌదీ అరేబియా

- April 21, 2016 , by Maagulf
అప్పుల బాటలో సౌదీ అరేబియా

దాదాపు దశాబ్దం తర్వాత సౌదీఅరేబియా మొదటిసారి రుణం కోసం ప్రయత్నిస్తోంది. ఎంత మొత్తం రుణం తీసుకోనుంది అన్నదానిపై స్పష్టత లేకపోయినా దాదాపు 6 బిలియన్‌ డాలర్ల నుంచి 8 బిలియన్‌ డాలర్లు రుణం తీసుకోవచ్చని సమాచారం. ఐదేళ్ల కాలపరిమితితో అమెరికన్‌ డాలర్ల రూపంలో తీసుకునే రుణానికి సంబంధించి రుణదాతలు ప్రతిపాదనలు పంపించాలని రియాద్‌ వర్గాలు కోరాయి. చమురు ధరలు పడిపోవడంతో బడ్జెట్‌ లోటును పూడ్చుకునేందుకు ఈ రుణం తీసుకోనుంది.
సౌదీ అరేబియా బడ్జెట్‌ లోటు గత ఏడాదితో 100 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. దీనిని పూడ్చుకునేదుకు విదేశాల్లోని ఆస్తులను విక్రయించడం, బాండ్లను పంపిణీ చేయడం వంటి చర్యలు చేపట్టింది. వీటిల్లో కూడా కొన్ని సమస్యలు ఎదురవ్వడంతో రుణంవైపు మొగ్గు చూపింది. దీనికి సంబంధించి సిటీగ్రూప్‌తోపాటు మరి కొన్ని సంస్థలు సౌదీ ప్రభుత్వానికి సలహాదార్లుగా వ్యవహరిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com