వాట్సప్‌లో అందుబాటులోకి కొత్త సదుపాయాలు..
- November 04, 2022
స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతీఒక్కరూ వాట్సప్‌ను వినియోగిస్తారనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవలే వాట్సప్ గ్రూప్‌లో సభ్యుల సామర్థ్యాన్ని పెంచుతూ సంస్థ అప్డేట్ చేసింది. వాట్సప్ తన వినియోగదారులకు కొత్తగా మరికొన్ని సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది. ఇకనుంచి ఓ వినియోగదారుడు వాయిస్, వీడియోకాల్స్ ఒకేసారి 32మందితో అనుసంధానం కావచ్చు. అంతేకాదు 2జీబీ సామర్థ్యం కలిగిన ఫైళ్లనుకూడా పంపే వెసులుబాటు ఉంటుంది. గతంలో 16ఎంబీ ఫైళ్లను మాత్రమే పంపించుకొనే వెసులుబాటు ఉండేది.
వాట్సాప్ గ్రూప్‌లో ప్రస్తుతం 512 మంది పరిమితం. ఇకనుంచి గ్రూపులో 1024 మందిని సభ్యులుగా చేర్చుకునేందుకు వీలుంటుందని కంపెనీ ప్రకటించింది. కమ్యూనిటీల్లో సభ్యులను 5వేల మందికి పెంచుకోవచ్చు. మెటా వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఫేస్ బుక్ ద్వారా ఈ వివరాలు వెల్లడించారు. కమ్యూనిటీల్లో సభ్యులను 5వేల మందికి పెంచుకోవచ్చు. వాట్సప్ పై కమ్యూనిటీస్‌ను ప్రారంభిస్తున్నామని తెలిపారు.
గ్రూపులు తిరిగి సబ్ గ్రూపులను, మల్టీఫుల్ థ్రెడ్స్, ఎనౌన్స్ మెంట్ ఛానళ్లు ఏర్పాటు చేసుకోవచ్చునని తెలిపారు. చాట్ ఫోల్స్ నిర్వహించుకోవచ్చునని, ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ కారణంగా ఇవి పూర్తిగా సురక్షితంగానూ, ప్రైవేటుగా ఉంటాయని మార్క్ జుకర్ తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్‌లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







