యూఏఈ రోడ్లపై మారిన స్పీడ్ లిమిట్స్
- November 06, 2022
యూఏఈ: ప్రతి ఎమిరేట్‌లోని ట్రాఫిక్ ఫ్లోపై ఇంజనీర్లు సమర్పించిన సాంకేతిక నివేదికల ప్రకారం యూఏఈ రోడ్లపై వేగ పరిమితుల్లో మార్పులు చేశారు. అబుధాబి మినహా అన్ని ఎమిరేట్స్‌లలో వాహనదారుల బఫర్ స్పీడ్ ను నిర్ణీత వేగ పరిమితి కంటే 20 కి. మీ. ఎక్కువగా ప్రయాణించడానికి అనుమతించారు. అబుధాబి 2018లో బఫర్ విధానాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. దుబాయ్ పోలీసులు తమ వెబ్‌సైట్‌లో వివిధ రహదారులపై వేగ పరిమితులను వివరించే వివరాలను పొందుపర్చారు. నవంబర్ 3న చేసిన తాజా అప్‌డేట్ ప్రకారం.. వేగ పరిమితులు 60 నుండి 120 కి. మీ. వరకు ఉన్నాయి. మొహమ్మద్ బిన్ జాయెద్, ఎమిరేట్స్ రోడ్‌లలో వేగ పరిమితి గంటకు 110కి.మీ.గా ఉన్నది. అయితే, మిగతా అంతర్గత రోడ్లలో వేగ పరిమితిని 70 కి.మీ.గా నిర్ణయించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







