మహిళకు Dh540,000 చెల్లించాలని ఆదేశించిన కోర్టు
- November 06, 2022
యూఏఈ: ఒక యువకుడు వివాహం చేసుకుంటానని ఓ మహిళ నుండి Dh 540,000 తీసుకొని మోసం చేశాడు. ఆ డబ్బుతో వివాహం అనంతరం సొంత గృహాన్ని నిర్మిస్తానని హామీ ఇచ్చి మోసానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో అరబ్ మహిళ ఆ వ్యక్తి తన నుండి తీసుకున్న Dh540,000, తన లగ్జరీ కారు అమ్మకం ద్వారా పొందిన డబ్బును తిరిగి చెల్లించాలని ఆ వ్యక్తిని ఆదేశించాలని కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు కోర్టు ఫైల్స్ చెబుతున్నాయి. అలాగే భౌతిక, నైతిక నష్టాలకు మరో 100,000 దిర్హామ్‌లను కూడా ఇప్పంచాలని తన దావాలో కోరింది. సదరు వ్యక్తి తన లగ్జరీ కారును కూడా తీసుకెళ్లి విక్రయించాడని, అయితే తనకు ఆ మొత్తాన్ని ఇవ్వలేదని మహిళ తన పిటిషన్ లో పేర్కొంది. అన్ని పక్షాల వాదనలు విన్న అల్ ఐన్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కోర్టు.. మహిళ నుండి తీసుకున్న Dh540,000, నష్టపరిహారంగా మరో Dh40,000 చెల్లించాలని సదరు వ్యక్తిని ఆదేశించింది. అలాగే మహిళకు న్యాయపరమైన ఖర్చులను కూడా చెల్లించాలని తన తీర్పులో కోర్టు పేర్కొంది.
తాజా వార్తలు
- భూ మార్గాల ద్వారా కార్గో మళ్లింపు..కువైట్ కస్టమ్..!!
- ఖతార్ నేషనల్ లైబ్రరీ రీ ఓపెన్..టైమింగ్స్ ఇవే..!!
- రష్యన్ ఉప విదేశాంగ మంత్రితో బహ్రెయిన్ రాయబారి భేటీ..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు ఎంత మేర పెరగవచ్చు?
- ఒమన్ లో భారీ వర్షాలు..భద్రతా హెచ్చరికలు జారీ..!!
- సౌదీ అరేబియాకు ఫ్రాన్స్ మద్దతుగా ఉంటుంది: మాక్రాన్
- JEE మెయిన్ సెషన్-2 పరీక్షల షెడ్యూల్ విడుదల
- సమ్మర్ షెడ్యూల్ రిలీజ్ చేసిన DGCA..
- అమెరికా వీసాలకు ‘ట్రంప్’ బ్రేక్
- ఇంద్రకీలాద్రి వసంతోత్సవాలకు పోటెత్తిన భక్తులు









