రేపు సుప్రీం కోర్టు విచారణ లైవ్ స్ట్రీమింగ్..
- November 06, 2022
న్యూ ఢిల్లీ: సుప్రీంకోర్టులో కేసు విచారణను సోమవారం లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బెంచ్ ఆధ్వర్యంలో జరిగే విచారణను లైవ్ స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి ప్రత్యేక కారణం ఉంది.
ప్రధాన న్యాయమూర్తిగా సోమవారం జస్టిస్ యూయూ లలిత్‌కు చివరి రోజు. దీంతో న్యాయమూర్తిగా తన చివరిరోజు విచారణను జస్టిస్ లలిత్ లైవ్ స్ట్రీమింగ్ చేయాలనుకున్నారు. ఇక ఈ బెంచ్‌లో జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ బెలా ఎమ్ త్రివేది కూడా ఉన్నారు. గత ఆగష్టులో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ చివరి పని రోజున కూడా ఇలాగే లైవ్ స్ట్రీమింగ్ చేశారు. తాజా లైవ్ స్ట్రీమింగ్ సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమవుతుంది. సుప్రీంకోర్టు వెబ్ క్యాస్ట్ చానెల్‌తోపాటు, యూట్యూబ్ ఛానెల్ ద్వారా లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. మరోవైపు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేయబోతున్న జస్టిస్ యూయూ లలిత్ మీడియాతో మాట్లాడారు.
తన పనితీరు విషయంలో సంతృప్తితో ఉన్నట్లు చెప్పారు. ‘‘ఈ రంగంలో 39 ఏళ్లుగా పని చేస్తున్నాను. నిజాయితీగా చెప్పాలంటే ప్రతి రోజూ నా వృత్తిని ఆస్వాదించాను. న్యాయవ్యవస్థలోని అన్ని దశల్ని చూశాను. అటు న్యాయవాదిగా.. ఇటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశాను. ఈ రంగంలోని అన్ని కోణాల్ని పరిశీలించాను. నేను సాధించినదాని విషయంలో పూర్తి సంతృప్తితో ఉన్నాను’’ అని జస్టిస్ యూయూ లలిత్ అన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







