కోవిడ్-19 అన్ని ఆంక్షలను ఎత్తేసిన యూఏఈ
- November 07, 2022
యూఏఈ: దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత అన్ని కోవిడ్ -19 ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు యూఏఈ ప్రభుత్వం ప్రకటించింది. ఆసుపత్రులలో ఆక్యుపెన్సీ రేట్లు, కోవిడ్ -19 సోకిన కేసుల ఇంటెన్సివ్ కేర్‌ను పర్యవేక్షిస్తూ దేశంలోని ఎపిడెమియోలాజికల్ పరిస్థితిని జాగ్రత్తగా అధ్యయనం చేసిన తర్వాత రెండవ దశ సడలింపులను ఆమోదించినట్లు ఆరోగ్య అధికారులు పేర్కొన్నారు. ప్రార్థనా స్థలాలు, మస్జీదులతో సహా అన్ని బహిరంగ, మూసి ఉన్న ప్రదేశాలలో మాస్కులు ధరించడం ఇక ఆప్షనల్. అయితే, ఆస్పత్రులు ఇతర ఆరోగ్యో కేంద్రాలలో అనారోగ్య బాధితులు మాత్రం కచ్చితంగా మాస్కులు ధరించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. కొత్త నిబంధనలు నవంబర్ 7 నుంచి అమల్లోకి రానున్నాయి. అల్ హోస్న్ అప్లికేషన్ ఇకపై టీకా ఫ్రూప్ కే పరిమితం చేయబడుతుందని తెలిపారు. కాగా, నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NCEMA) పాజిటివ్ కేసుల కోసం ఐదు రోజుల ఐసోలేషన్ వ్యవధి అలాగే ఉంటుందని, కోవిడ్-19 పీసీఆర్ పరీక్ష, ఆరోగ్య సౌకర్యాలు ఇప్పటికీ పనిచేయనున్నాయి.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







