బహిరంగ పక్షులకు ఆహారం ఇవ్వడం మానుకోండి
- November 07, 2022
మస్కట్: బహిరంగ ప్రదేశాలలో పక్షులకు ఆహారం ఇవ్వడం మానుకోవాలని మస్కట్ మునిసిపాలిటీ సూచించింది. దీని కారణంగా ప్రజల ఆరోగ్యంతోపాటు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని హెచ్చరించింది. మిగిలిపోయిన ధాన్యాలు, పక్షుల వ్యర్థాలతో కలిసిపోయి కుళ్ళిపోయి.. దుర్వాసన వెదజల్లుతుందని పేర్కొంది. దీని కారణంగా ప్రజలు తమ సమయాన్ని ఆరుబయట గడపకుండా లేదా బహిరంగ కూడళ్లలో క్రీడా కార్యకలాపాల్లో పాల్గొనకుండా అడ్డుకుంటుందని మున్సిపాలిటీ తెలిపింది. అంతేకాకుండా పక్షులను పోషించే ఉద్దేశంతో ధాన్యాలను నడక మార్గాలు, కాలిబాటలపై వేయడంతో అక్కడ కీటకాలు, పురుగులు, పరాన్నజీవుల సంఖ్య పెరిగి వాతావరణం కలుషితం అవుతందని, ఇది పురపాలక సిబ్బందిపై అదనపు భారాన్ని మోపుతుందని మస్కట్ మునిసిపాలిటీ పేర్కొన్నది.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







