వారంలో 30,000 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు
- November 07, 2022
కువైట్: గత వారంలో ఆరు గవర్నరేట్లలో చేపట్టిన ట్రాఫిక్ భద్రతా ప్రచారాల సందర్భంగా 30,426 ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేసినట్లు కువైట్ సాధారణ ట్రాఫిక్ విభాగం వెల్లడించింది. ఈ ప్రచారాల సందర్భంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న 47 మంది బాలబాలికలను అరెస్టు చేసినట్లు పేర్కొంది. పెండింగ్‌లో ఉన్న వివిధ కేసుల్లో 84 వాహనాలు, 15 ద్విచక్రవాహనాలను కూడా సీజ్ చేసినట్లు వెల్లడించింది. గత వారంలో ట్రాఫిక్ పెట్రోలింగ్‌లు 244 తీవ్రమైన, 1,607 చిన్న ప్రమాదాలతో సహా 1,851 ట్రాఫిక్ ప్రమాదాలను కూడా డీల్ చేశామని సాధారణ ట్రాఫిక్ విభాగం తెలిపింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







