వచ్చింది పోయింది.! జాన్వీ ఎందుకిలా చేస్తోంది.!
- November 07, 2022
బిల్డప్ ఎక్కువ. బిజినెస్ తక్కువ అన్న చందంగా మారింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పరిస్థితి. హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసి పదేళ్లు కావస్తోంది. పదేళ్ల కెరీర్ అనేది అస్సలు చిన్న విషయమే కాదు హీరోయిన్ల విషయంలో.
అలాంటిది జాన్వీ కపూర్ ఎందుకని తన కెరీర్‌ని చేతులారా పాడుచేసుకుంటుంది.? అనేది శ్రీదేవిని అమితంగా అభిమానించే వారి అభిప్రాయం. శ్రీ దేవిపై వున్న అభిమానంతో, ఆమె కూతురు జాన్వీ కపూర్‌ని కూడా ఆరాధించారు, ఇప్పటికీ ఆరాధిస్తూనే వున్నారు సౌత్ జనం.
కానీ, సౌత్ వైపు కన్నెత్తయినా చూడడం లేదు జాన్వీ కపూర్. పోనీ నార్త్‌లో అయినా జాన్వీ స్టార్ హీరోయిన్ అనిపించుకుంటోందా.? అంటే అదీ లేదు. ఎక్కువగా రీమేక్ సినిమాలే చేస్తోంది. అందులోనూ హీరోయిన్ సెంట్రిక్ మూవీసే. అవి ఆమెకు స్టార్డమ్ తెచ్చిపెట్టట్లేదు సరికదా. కెరీర్‌కి ఇసుమింతైనా ఉపయోగపడట్లేదు.
అయినా కానీ, జాన్వీకపూర్ తన పంథా మార్చుకోవడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే, హీరోయిన్గా జాన్వీ కపూర్ ఖేల్ ఖతమ్, దుకాణ్ బంధ్.. అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. జాన్వీ ఓకే అనాలే కానీ, సౌత్‌లో బోలెడన్ని ఆఫర్లు ఎదురు చూస్తున్నాయ్. అతి తక్కువ టైమ్‌లోనే తనకున్న టాలెంట్కీ, గ్లామర్ అప్పీల్కీ సౌత్‌లో స్టార్ హీరోయిన్ అయిపోవడం పక్కా. కానీ జాన్వీ ఎందుకో అందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. జాన్వీని అలా ప్రేరేపిస్తున్న తెర వెనకాల ఆ శక్కులేమిటో.! ఆమెకే తెలియాలి.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







