కోలుకుంటున్న పూజా హెగ్దే.! ఏమైందంటే.!
- November 08, 2022
ఇటీవల బుట్టబొమ్మ పూజా హెగ్దే చిన్నపాటి యాక్సిడెంట్ కారణంగా కాలికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా రెస్ట్ తీసుకుంటున్న పూజా హెగ్దే, ప్రస్తుతం కాస్త కోలుకుంటున్నట్లుగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ద్వారా తాజాగా తెలిపింది.
బుట్టబొమ్మగా పూజా హెగ్దేని అభిమానించేవాళ్లు చాలా మందే వున్నారు. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అనిపించుకున్న పూజాహెగ్దే, ఇటీవల వరుస సినిమాలతో బిజీగా గడిపింది.
దురదృష్టవశాత్తూ పూజా హెగ్దే నుంచి వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయ్. అయినా కానీ, పూజా హెగ్దే ఇమేజ్‌కి ఏమాత్రం డ్యామేజ్ కాలేదు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో పూజా హెగ్దే నటిస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొదుతోన్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఆ షెడ్యూల్‌లో పూజా హెగ్దే కూడా పాల్గొనబోతోందని తెలుస్తోంది. అప్పటికల్లా పూర్తిగా కోలుకుంటానని చెబుతోంది పూజా హెగ్దే.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
- డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తల్లి ఇకలేరు
- 30న అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ 26వ స్నాతకోత్సవం
- హెచ్-1బీ వీసాల పై ట్రంప్ నిర్ణయం …
- ఆసియా కప్ ఫైనల్లో భారత్–పాకిస్థాన్ పోరు
- నేరగాళ్లను నేపాల్, ఉజ్బెకిస్తాన్ అధికారులకు అప్పగింత..!!
- కువైట్ లో 5,800 ట్రాఫిక్ వయోలేషన్స్, 153 మంది అరెస్టు..!!
- యాన్యువల్ నావల్ ఎక్సర్ సైజ్ సీ లయన్ ముగింపు..!!
- జూలైలో 30.4% పెరిగిన సౌదీ నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- సల్వా – ఈస్ట్ ఇండస్ట్రియల్ రోడ్ బ్రిడ్జ్ మూసివేత..!!