అనిఖా సురేంద్రన్.! ‘బుట్టబొమ్మ’‌గా సక్సెస్ కొడుతుందా.?

- November 08, 2022 , by Maagulf
అనిఖా సురేంద్రన్.! ‘బుట్టబొమ్మ’‌గా సక్సెస్ కొడుతుందా.?

‘విశ్వాసం’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన చిన్నారి గుర్తుంది కదా. ఆ పాప ఇప్పుడు హీరోయిన్‌ అయ్యింది. తెలుగులో ఆ చిన్నారి అనిఖా సురేంద్రన్ హీరోయిన్‌గా డెబ్యూ చేస్తోంది. ‘బుట్టబొమ్మ’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్ రీసెంట్‌గా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
చాలా ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది అనిఖా సురేంద్రన్ ఈ సినిమాలో. చిన్నప్పుడే యాక్టింగ్‌లో తానేంటో ప్రూవ్ చేసుకుంది అనిఖా సురేంద్రన్. ఇక, ఇప్పుడు చాలా పరిణీతితో కూడిన నటన కనబరుస్తోంది బుట్టబొమ్మ కోసం. 
పల్లెటూరి అమ్మాయి పాత్రలో క్యూట్ లుక్స్‌తో నేచురల్‌గా కనిపిస్తోంది అనిఖా సురేంద్రన్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఫార్ట్యూన్ 4 సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తున్నారు. 
అర్జున్, సూర్యలు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ని బట్టి, ఇదో యూత్‌ఫుల్ ఎంటర్‌‌టైనర్ అనిపిస్తోంది. చూడాలి మరి, హీరోయిన్‌గా అనిఖా సురేంద్రన్ డెబ్యూ మూవీ వర్కవుట్ అవుతుందో లేదో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com