సౌదీలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు!
- November 09, 2022
రియాద్ : సౌదీ అరేబియాలోని చాలా ప్రాంతాల్లో గురువారం నుండి సోమవారం వరకు ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ (NCM) అంచనా వేసింది. కొన్ని ప్రదేశాలలో వడగళ్లు పడే అవకాశం ఉన్నది. అలాగే తీవ్రమైన గాలులు వీచే అవకాశం ఉంది. ధూళి కారణంగా కొన్ని ప్రదేశాలలో దృశ్యమాన్యత తగ్గుతుందని ఎన్సీఎం వెల్లడించింది. హైల్, బకా, అల్-గజాలా, యాష్ షినాన్‌తో సహా హేల్ ప్రాంతంలోని చాలా నగరాల్లో భారీ వర్షాలకు వరదలు వచ్చే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇతర సౌదీ ప్రాంతాలు మక్కా, మదీనా, తూర్పు ప్రాంతం (అల్-షర్కియా), అల్ ఉలా, యాన్బు, మహ్ద్, నైరియా, ఖర్యాత్ అల్ ఉల్యా, వాడి అల్ ఫోరా, అల్ హెనకియా, ఖైబర్, అల్ ఐస్, బదర్, హఫర్ అల్ బతిన్, ఖాఫ్జీ, నార్తర్న్ బోర్డర్స్ ప్రావిన్స్, అరార్, రఫ్హా, తైఫ్, అల్-జుముమ్, అల్ కమిల్, ఖులైస్, మైసాన్ తీవ్రంగా ప్రభావితం కావచ్చు. తబుక్, అల్-జౌఫ్, మక్కా, ఉత్తర సరిహద్దు ప్రాంతాలు, జెడ్డా, ఉమ్లుజ్, సకాకా, తైమా, అల్-వాజ్, దుమాహ్ అల్ జండాల్, అల్-ఖురయ్యత్, తురైఫ్, తుబర్జల్, రబీగ్, నగరాలతో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎన్సీఎం పేర్కొంది. రియాద్, ఖాసిమ్, తబుక్, అసిర్, జజాన్, అల్-బహా ప్రాంతాలలో చురుకైన గాలులు ప్రభావం ఉండే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం
- పవన్ కల్యాణ్ ,చంద్రబాబు సమావేశం ముగింపు..
- NATS మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
- మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
- సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!
- ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని త్వరగా పరిష్కరించండి..!!
- దుబాయ్ లో డ్రైవర్ లెస్ భారీ వాహనాల కోసం పైలట్ రూట్స్..!!
- హవల్లిలో అక్రమ గర్భస్రావ క్లినిక్..ప్రవాసి అరెస్టు..!!
- చట్టవిరుద్ధంగా తొలగింపు.. ఐదుగురు ఉద్యోగులకు పరిహారం..!!