కువైట్ లో 20 మిలియన్ దినార్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం

- November 09, 2022 , by Maagulf
కువైట్ లో 20 మిలియన్ దినార్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం

కువైట్: దేశంలోకి 10 మిలియన్ లారికా మాత్రలను(డ్రగ్స్‌) అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని షువైఖ్ పోర్ట్ వద్ద అడ్డుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పట్టుబడ్డ మాదకద్రవ్యాల మార్కెట్ విలువ సుమారు 20 మిలియన్ దినార్లు ఉంటుందని అంచనా వేసింది. ఈ లారికా మాత్రలు చైనా నుండి వస్తున్న ఫర్నిచర్‌లో దాచి తరలిస్తుండగా గుర్తించి స్వాధీనం చేసుకున్నట్ల తెలిపింది. మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్  షువైక్ ఓడరేవును సందర్శించి స్వాధీనం చేసుకున్న లారికా మాత్రలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులను ప్రశంసించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com