ఆకట్టుకుంటున్న బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌షో
- November 09, 2022
బహ్రెయిన్ : బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌షో (BIAS) 2022 యొక్క ఆరవ ఎడిషన్ సఖిర్ ఎయిర్ బేస్‌లో హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైంది. ఇది నవంబర్ 11 వరకు కొనసాగుతుంది. ఎయిర్ షో ప్రారంభం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక విమాన విన్యాసాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఇందులో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇతర దేశాల నుండి ఉన్నత స్థాయి ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ ప్రదర్శనలో 200కు పైగా ఉన్నత స్థాయి పౌర, సైనిక ప్రతినిధి బృందాలు, అలాగే అంతర్జాతీయ విమానయాన సంస్థలు, ప్రముఖ గ్లోబల్ ఏరోస్పేస్ కంపెనీల నుండి సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, ప్రైవేట్, ప్రభుత్వ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారు. స్టాటిక్ ఫ్లయింగ్ డిస్ప్లేలు, రాయల్ బహ్రెయిన్ ఎయిర్ ఫోర్స్, యునైటెడ్ స్టేట్స్ నావల్ ఎయిర్ ఫోర్స్, రాయల్ సౌదీ ఎయిర్ ఫోర్స్, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ తో సహా 100 కంటే ఎక్కువ కమర్షియల్, మిలిటరీ విమానాలు పాల్గొంటున్నాయి. స్థానిక జానపద బృందాలు, సంగీత విద్వాంసుల ప్రదర్శనలతో పాటు సఖిర్ ఆకాశంలో ఉత్తేజకరమైన ప్రదర్శనలను ఆస్వాదించడానికి సాధారణ ప్రజలకు, కుటుంబ సభ్యులకు, పిల్లలకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జోన్లో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ నిర్వహిస్తున్న హెరిటేజ్ విలేజ్ ఉన్నది. ఇది బహ్రెయిన్‌లో తయారు చేసిన వివిధ రకాల స్థానిక ఉత్పత్తులు, పిల్లల వినోద ఆటలు, వివిధ పోటీలను నిర్వహిస్తుంది. అలాగే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జోన్లో ఫుడ్ ఫెస్టివల్ ఆకట్టుకుంటుంది. 12 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న కుటుంబ జోన్ కోసం పెద్దల టిక్కెట్ల ధర రోజుకు BD5గా నిర్ణయించారు. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ప్రవేశం ఉచితం.
తాజా వార్తలు
- ఆసియా కప్ విజేతగా భారత్
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం
- పవన్ కల్యాణ్ ,చంద్రబాబు సమావేశం ముగింపు..
- NATS మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
- మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
- సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!
- ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని త్వరగా పరిష్కరించండి..!!
- దుబాయ్ లో డ్రైవర్ లెస్ భారీ వాహనాల కోసం పైలట్ రూట్స్..!!
- హవల్లిలో అక్రమ గర్భస్రావ క్లినిక్..ప్రవాసి అరెస్టు..!!