తండ్రిపై 3.3 మిలియన్ దిర్హామ్‌ల దావా గెలిచిన కూతురు
- November 09, 2022
యూఏఈ: కుమార్తె సొమ్ముతో కొనుగోలు చేసిన ఆస్తిని ఆమెకు తెలియకుండా విక్రయించినందుకు ఒక తండ్రి తన కుమార్తెకు 3.3 మిలియన్ దిర్హామ్‌లు చెల్లించాలని అబుధాబి ఫ్యామిలీ అండ్ సివిల్ అడ్మినిస్ట్రేటివ్ క్లెయిమ్స్ కోర్టు ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. 16 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన ఆస్తిని అమ్మిన తండ్రిపై కూతురు కోర్టులో దావా వేసింది. తనకు Dh3.7 మిలియన్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. తన తండ్రి స్వాధీనంలో ఉన్న ఆస్తిని 2021లో తనకు తెలియకుండా 3.7 మిలియన్ దిర్హామ్‌లకు విక్రయించాడని, అమ్మిన నగదు మొత్తాన్ని అతను తన వద్దనే ఉంచుకున్నాడని ఆమె తన పిటిషన్ లో పేర్కొంది. అన్ని పక్షాల వాదనలు విన్న అబుధాబి ఫ్యామిలీ అండ్ సివిల్ అడ్మినిస్ట్రేటివ్ క్లెయిమ్స్ కోర్టు తన కుమార్తెకు 3.3 మిలియన్ దిర్హామ్‌లు చెల్లించాలని తండ్రిని ఆదేశించింది. నష్టపరిహారం కింద Dh50,000 చెల్లించాలని, కుమార్తె న్యాయపరమైన ఖర్చులను కూడా చెల్లించాలని అతనిని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- ఆసియా కప్ విజేతగా భారత్
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం
- పవన్ కల్యాణ్ ,చంద్రబాబు సమావేశం ముగింపు..
- NATS మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
- మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
- సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!
- ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని త్వరగా పరిష్కరించండి..!!
- దుబాయ్ లో డ్రైవర్ లెస్ భారీ వాహనాల కోసం పైలట్ రూట్స్..!!
- హవల్లిలో అక్రమ గర్భస్రావ క్లినిక్..ప్రవాసి అరెస్టు..!!