అల్ మజ్రౌవా యార్డ్‌లో ఫిష్ ఎగ్జిబిషన్
- April 22, 2016
పెద్ద మొత్తంలో చేపలు మాంసాహార ప్రియులకు చవులూరించేలా చేస్తున్నాయి. అల్ మజ్రౌవా యార్డ్‌లో ప్రారంభమైన ఫిష్ ఎగ్జిబిషన్‌లో ఆకర్షించే ధరలతో చేపలు, మాంసాహార ప్రియులకోసం ఎదురుచూస్తున్నాయి. ఉమ్ సలాల్‌లోని అల్ మజ్రౌవా యార్డ్ దీనికి వేదికయ్యింది. మూడు రోజులపాటు ఈ ఫిష్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ మరియు ఎన్విరాన్‌మెంట్, ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ స్థానిక ఫిషర్‌మెన్ చేపల్ని డైరెక్ట్‌గా విక్రయించేందుకు ఈ ఫిష్ ఎగ్జిబిషన్‌ని ఏర్పాటు చేశాయి. హేమర్, షారి, కింగ్ ఫిష్ సమా పలు రకాలైన చేపలు ఇక్కడ కొలువుదీరాయి. సముద్రం నుంచి నేరుగా, మార్కెట్‌లోకి చేపల్ని తీసుకొస్తున్నారు ఫిషర్‌మెన్. ఏప్రిల్, మే నెలల్లో సముద్రంలో చేపలు ఎక్కువగా దొరుకుతాయని ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ హెడ్ మొహమ్మద్ సయీద్ చెప్పారు. స్థానికంగా ఉత్పత్తి అయ్యే చేపల్నే ఎగ్జిబిషన్‌లో విక్రయానికి ఉంచామని, వాటిపై స్పెషల్ ఇస్కౌంట్లు కూడా ఉంటాయని ఆయన చెప్పారు. ఆగస్ట్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు కింగ్ ఫిష్‌ని ఫిషింగ్ నెట్ ద్వారా వేటాడటాన్ని జిసిసి దేశాలు నిషేధించాయి. ఈ నిషేధం కారణంగా ఆ సమయంలో చేపల సంతతి పెరగడానికి దోహదపడుతుంది.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







