రస్ అల్ ఖైమాలో న్యూఇయర్ సెలబ్రేషన్స్: ప్రపంచ రికార్డు కోసం ఫైర్ వర్క్స్

- November 11, 2022 , by Maagulf
రస్ అల్ ఖైమాలో న్యూఇయర్ సెలబ్రేషన్స్: ప్రపంచ రికార్డు కోసం ఫైర్ వర్క్స్

యూఏఈ: 2023 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. కొత్త ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టే లక్ష్యంతో ఫైర్ వర్క్స్ నిర్వహించేందుకు రస్ అల్ ఖైమా సన్నాహాలు చేస్తోంది. ఎలక్ట్రానిక్ బీట్‌లకు కొరియోగ్రాఫ్ చేసిన పైరో డ్రోన్‌లు, నానో లైట్లు, రంగులు, ఆకారాలను ఉపయోగించి డిసెంబర్ రాత్రి 12 గంటలకు ఆకాశంలో 12 నిమిషాలపాటు ఫైర్ వర్క్స్ నిర్వహించనున్నది. అల్ మర్జన్ ద్వీపం, అల్ హమ్రా విలేజ్ మధ్య వాటర్ ఫ్రంట్ వెంబడి 4.7 కి.మీల విస్తీర్ణంలో ఈ భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు.

ఇప్పటికే రస్ అల్ ఖైమా గతంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నిర్వహించిన ఫైర్ వర్క్స్ అనేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లను కలిగి ఉంది. 2022లో బాణసంచాలో 15,000 ఎఫెక్ట్‌లు, 452 ఫైర్ వర్క్స్ డ్రోన్‌లను ఉపయోగించి వేడుకలను నిర్వహించింది. వీటికి సంబంధించి ఏకకాలంలో ‘మోస్ట్ రిమోట్ ఆపరేటెడ్ మల్టీరోటర్స్/డ్రోన్స్ లాంచింగ్’ ,  ‘హయ్యస్ట్ ఆల్టిట్యూడ్ మల్టీరోటర్/డ్రోన్ ఫైర్‌వర్క్ డిస్ప్లే’ లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాయి. నేషనల్ అథారిటీ ఫర్ ఎమర్జెన్సీ, క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్‌తో సమన్వయంతో వేడుకల నిర్వహణ కమిటీ, రస్ అల్ ఖైమా టూరిజం డెవలప్‌మెంట్ అథారిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com