మా హృదయ, గవాక్షాలు తెరిచే ఉంటాయి

- June 17, 2015 , by Maagulf
మా హృదయ, గవాక్షాలు తెరిచే ఉంటాయి

బహ్రైన్ ప్రధానమంత్రి రాయల్ హైనెస్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, షేక్ మొహమ్మద్ సయాద్ సలేహ్ అల్ అరబీ నాయకత్వంలోని పండితులను, మతపెద్దలను ఆహ్వానిస్తూ, ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, సమస్యలను పరిష్కరించి, పరాయివారిని తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొనీయని తమ బహ్రైన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాలవారిని ఏకం చేసి, జాతీయ ఐక్యతను పెంపొందించడానికి తమ హృదయాలు, ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు.

తమ ప్రజలు సంఘీభావానికి పేరు పొందిన వారని, వారిలో ఈ విధంగా ఐకమత్యాన్ని పెంపొందించడంలో మత పెద్దలు, పండితులు బోధించిన  స్నేహం, సౌభ్రాతృత్వం, సహనం అనే గుణాలు ప్రజలను పూలలో దారంలా సుస్థిరంగా  ఉంచాయన్నారు.

విచ్చేసిన మతపెద్దలు, తమ ప్రభువు యొక్క జ్ఞానాన్ని, దూరదృష్టిని, విశాల దృక్పధాన్ని, అందరినీ సమ దృష్టితో చూసే సరళీకృత విధానాలను మానస్ఫూర్తిగా ప్రశంసించారు. తమ అధినేత విధానాలు అన్ని కష్టాలకు ఔషధ లేపనం వంటిదనీ, అవి అన్ని సామాజిక వర్గాలను ఏకీకృతం చేసాయనీ, తన ప్రజల విజ్ఞాపనలను, అభిప్రాయాలను గౌరవించే తమ రాజు గారి ఔన్నత్యాన్ని వేనోళ్ల కొనియాడారు.

 

--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రైన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com