రాజీవ్ గాంధీ హత్య కేసుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
- November 11, 2022
న్యూ ఢిల్లీ: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆరుగురు దోషులను విడుదల చేయాలని ఆదేశాలు జారీచేసింది. నళిని, రవిచంద్రన్, రాబర్ట్, రాజా, శ్రీహరణ్, జైకుమార్‌ను కూడా విడుల చేయాలని ఆదేశించింది. తమను ముందస్తుగా విడుదల చేయాలని కోరుతూ నళిని, రవిచంద్రన్ ఇద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌పై విచారించిన.. జస్టిస్ బీఆర్ గవాయి, బీవీ నాగరత్న నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఈ తీర్పు వెలువరించింది. మే 17న ఈ కేసులో మరో దోషిగా ఉన్న పేరరివాళన్‌ను విడుదల చేస్తూ ఆదేశాలు జారీచేశామని.. అది వీరికి కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. కాగా, ఇప్పటికే పేరరివాళన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ కేసులోని దోషులు దాదాపు 30 ఏళ్లుగా జైల్లో ఉన్నారు.సెప్టెంబరు 9, 2018న దోషులను విడుదల చేయాలని తమిళనాడు కేబినెట్ సిఫారసు చేసిందని, ప్రవర్తన కూడా బాగానే ఉండడంతో.. వారిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాజీవ్ గాంధీపై ఆత్మాహుతి దాడి జరిగింది. ధను మహిళ తనను తాను పేల్చుకుంది. ఆ దుర్ఘటనలో రాజీవ్ గాంధీతో పాటు మరో 14 మంది మరణించారు. ఈ కేసులో ఏడుగురిని దోషులుగా తేల్చుతూ 1998లో ఉగ్రవాద వ్యతిరేక కోర్టు మరణ శిక్ష విధించింది. ఐతే ఆ మరుసటి ఏడాది పేరరివాళన్ సహా మురుగన్, నళిని, శాంతన్ మరణశిక్షను సుప్రీంకోర్టు నిలిపివేసింది. అనంతరం 2014లో పేరరివాళన్‌తో పాటు శాంతన్, మురుగన్ మరణశిక్షను జీవిత ఖైదుగా తగ్గించింది. 2000లో సోనియా గాంధీ జోక్యంతో నళిని మరణశిక్షను కూడా యావజ్జీవ కారాగారశిక్ష తగ్గించారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







