ఖతార్‌లో 25.2396 కిలోల నిషేధిత పొగాకు స్వాధీనం
- November 11, 2022
దోహా: హమద్ పోర్ట్‌లో నిషేధిత నమిలే పొగాకును తరలించేందుకు చేసిన ప్రయత్నాన్ని మారిటైమ్ కస్టమ్స్ విభాగం అడ్డుకుంది. అనుమానంతో కొబ్బరి, నిమ్మకాయలతో కూడిన షిప్ మెంట్లను తనిఖీలు చేయగా.. 25.2396 కిలోల బరువున్న నిషేధిత పొగాకు వస్తువులను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారి తెలిపారు. గత కొన్ని వారాల్లో నిషేధిత పొగాకు స్వాధీనం చేసుకోవడం ఇది మూడోసారి. హమద్ పోర్ట్ అధికారులు నవంబర్ 7న 2,962 కిలోల నిషేధిత పొగాకు, తమలపాకులను స్వాధీనం చేసుకున్నారు. అదే పోర్ట్‌లో అక్టోబర్ 27న 7,000 కిలోల కంటే ఎక్కువ బరువున్న నిషేధిత పొగాకును స్వాధీనం కస్టమ్స్ విభాగం చేసుకున్నారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్







