విజిట్ వీసా పునరుద్ధరణకు ఆరోగ్య బీమా కవరేజ్ తప్పనిసరి

- November 12, 2022 , by Maagulf
విజిట్ వీసా పునరుద్ధరణకు ఆరోగ్య బీమా కవరేజ్ తప్పనిసరి

రియాద్: విజిట్ వీసాల పునరుద్ధరణకు కొత్త ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని సౌదీ అరేబియా హెల్త్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ తెలిపింది. విజిట్ వీసా పొడిగించిన కాలానికి కొత్త బీమా కవరేజీని తప్పనిసరిగా పొందాలని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ (జవాజత్) తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. తవునియా, బుపా, మెడ్‌గల్ఫ్, గల్ఫ్ యూనియన్, అరేబియా షీల్డ్ కోఆపరేటివ్ ఇన్సూరెన్స్, అరేబియా కోఆపరేటివ్ ఇన్సూరెన్స్, అల్-ఎతిహాద్ కోఆపరేటివ్, అల్-సాగ్ర్ కోఆపరేటివ్ హెల్త్ ఇన్సూరెన్స్, AXA కోఆపరేటివ్, అలైడ్ కోఆపరేటివ్ ఇన్సూరెన్స్ వంటి లైసెన్స్ పొందిన బీమా కంపెనీల ద్వారా ఆరోగ్య బీమా కవరేజీని పొందాలని సూచించింది. సింగిల్ ఎంట్రీ విజిట్ వీసాల గడువును మూడు నెలలకు పొడిగించేందుకు మంగళవారం మంత్రి మండలి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఎలాంటి రుసుము లేకుండా ట్రాన్సిట్ వీసాల బస వ్యవధి కూడా 96 గంటలకు పొడిగించబడింది.  వీసా నిబంధనల్లో సవరణల ప్రకారం.. సింగిల్ ఎంట్రీ ఫ్యామిలీ విజిట్ వీసాలు 30 రోజులు చెల్లుబాటు అవుతుండగా.. మల్టిపుల్ ఎంట్రీ వీసాలు 90 రోజులు చెల్లుబాటు అవుతాయని జవాజత్ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com