డైరెక్టర్ గా మారిన హీరో నాని సోదరి..
- November 12, 2022
హైదరాబాద్: నాని హీరోగా అందర్నీ అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఓ పక్క వరుస సినిమాలు చేస్తూనే మరోపక్క వాల్ పోస్టర్ పేరుతో నిర్మాణ సంస్థను నిర్మించి వరుస సినిమాలు నిర్మిస్తున్నారు. తాజాగా ‘మీట్ క్యూట్’ అనే సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి నాని సోదరి దీప్తి గంట దర్శకత్వం వహించడం విశేషం. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ తాలూకా పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా టీజర్ ను రిలీజ్ చేసి సినిమా ఫై ఆసక్తి పెంచారు.
ఈ సినిమాలో అందరూ యంగ్ హీరోహీరోయిన్స్ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రతి ఒక్కరి ఇద్దరి కలయిక వారి మధ్య వచ్చే మాటలు ప్లెజెంట్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఒక కథలో సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. రోహిణి మొల్లేటి, అదా శర్మ, వర్షా బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రుహాని శర్మ, సునైనా, సంచిత పూనాచ ఫీమేల్ లీడ్స్ గా, అశ్విన్ కుమార్, శివ కందుకూరి , దీక్షిత్ శెట్టి, గోవింద్ పద్మసూర్య, రాజా కథానాయకులుగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాను థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా ఓటిటి సంస్థ సోనీ లివ్ లో రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







