ఢిల్లీలో మరోసారి భూ ప్రకంపనలు..
- November 12, 2022
న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మరోసారి భూ ప్రకంపనలతో ఊగిపోయింది. శనివారం సాయంత్రం ఢిల్లీలో స్వల్ప భూకంపం సంభవించింది. ఢిల్లీతోపాటు నోయిడా, ఘజియాబాద్ వంటి పలు ఉత్తరాది ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు.
ఢిల్లీలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదైంది. భూకంప కేంద్రం నేపాల్‌లో, భూమికి 10 కిలోమీటర్ల దిగువన ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నెల 9న కూడా ఢిల్లీలో స్వల్ప భూకంపం సంభవించింది. ఢిల్లీతోపాటు నోయిడా, గుర్గావ్ వంటి ప్రాంతాల్లో 6.3 తీవ్రతతో భూమి కంపించింది. తాజాగా ఈ రోజు మరోసారి భూమి కంపించింది. వరుస భూ ప్రకంపనలతో డిల్లీ వాసులు ఆందోళనకు గురవుతున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







