హిట్ ది సెకండ్ కేస్.! విశ్వక్ సేన్‌ని అడవి శేష్ దాటిస్తాడా.?
- November 12, 2022
‘హిట్ - ది ఫస్ట్ కేస్’ అంటూ అప్పుడు యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సూపర్ హిట్టు కొట్టాడు. డిఫరెంట్ ఆటిట్యూడ్ వున్న పోలీసాఫీసర్ పాత్రలో విశ్వక్ సేన్ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఇప్పుడు ‘హిట్ - ది సెకండ్ కేస్’ అంటూ వస్తున్నాడు మరో యంగ్ హీరో అడవి శేష్. ‘హిట్’కి ప్రాంఛైజీగా రూపొందుతోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ రిలీజైన నాటి నుంచీ ఈ సినిమా వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. ‘మేజర్’ సినిమాతో ప్యాన్ ఇండియా రేంజ్ సొంతం చేసుకున్నాడు అడవి శేష్ కూడా.
సో, ఈ సినిమాకి అడవి శేష్ కారణంగా మంచి హైప్ క్రియేట్ అయ్యింది. మనోడి ఆటిట్యూడ్, ప్రామిసింగ్ పర్‌ఫామెన్స్ ఆల్రెడీ జనం చూసేశారు. ‘హిట్ 2’ కోసం స్పెషల్ ఆటిట్యూడ్‌తో అంచనాలు మరింత పెంచేస్తున్నాడు అడవి శేష్.
ఆటిట్యూడ్ సరే, ‘మేజర్’ ఇమేజ్‌ని ‘హిట్ 2’ తో అడవి శేష్ కంటిన్యూ చేయగలడా.? ‘హిట్ 1’ తో ఆల్రెడీ విశ్వక్ సేన్ ఓ పాథ్ ఫిక్స్ చేసేశాడు. దాన్ని ఓవర్ కమ్ చేయగలడా అడవి శేష్.? చూడాలి మరి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







