అబుధాబిలో హ్యారీపోటర్ థీమ్ ల్యాండ్

- November 13, 2022 , by Maagulf
అబుధాబిలో హ్యారీపోటర్ థీమ్ ల్యాండ్

యూఏఈ: అబుధాబిలోని యాస్ ద్వీపంలో ఏర్పాటైన హ్యారీపోటర్ థీమ్ ల్యాండ్  హ్యారీపోటర్ అభిమానులతోపాటు సందర్శకులను ఆహ్వానిస్తోంది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీతో భాగస్వామ్యంతో మిరల్ హ్యారీ పాటర్ నేపథ్య థీమ్ ను రూపొందించింది. మిడిల్ ఈస్ట్‌లో ఈ తరహా థీమ్ ల్యాండ్ మొదటిది కావడం గమనార్హం. మిరల్ చైర్మన్ మొహమ్మద్ ఖలీఫా అల్ ముబారక్ ఈ ప్రాజెక్ట్ గురించి చెబుతూ.. అబుధాబి పర్యాటక రంగానికి, ఎమిరేట్ వృద్ధికి, ఆర్థిక వైవిధ్యానికి దోహదపడుతుందన్నారు. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్లోబల్ బ్రాండ్స్ ప్రెసిడెంట్ పామ్ లిఫోర్డ్ మాట్లాడుతూ.. విజార్డింగ్ వరల్డ్ ప్రతి వయస్సు అభిమానులకు ఆనందాన్ని అందిస్తుందన్నారు. ఒరిజినల్ హ్యారీ పోటర్ కథలు, బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ సిరీస్‌లు ప్రపంచవ్యాప్తంగా వందల మిలియన్ల మంది అభిమానులను ఆకర్షించాయన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com