నవంబర్ 21 నుండి అజ్మాన్‌లో ట్రాఫిక్ జరిమానాలపై 50 శాతం తగ్గింపు
- November 13, 2022
యూఏఈ: అజ్మాన్ క్రౌన్ ప్రిన్స్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ అమ్మర్ బిన్ హుమైద్ అల్ నుయిమి ఆదేశాలతో అజ్మాన్ పోలీసులు నవంబర్ 21 నుండి 2023 జనవరి 1 వరకు ట్రాఫిక్ జరిమానాలలో యాభై శాతం తగ్గింపును ప్రకటించారు. అజ్మాన్ పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ షేక్ సుల్తాన్ బిన్ అబ్దుల్లా అల్ నుయిమి మాట్లాడుతూ.. నవంబర్ 11 నాటికి అజ్మాన్ ఎమిరేట్‌లో జరిగిన అన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఈ తగ్గింపు నిర్ణయం వర్తిస్తుందన్నారు. తమ ప్రాణాలకు, ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే విధంగా నిర్లక్ష్య డ్రైవింగ్, నిషేధించబడిన ప్రదేశంలో వాహనాలను ఓవర్టేక్ చేయడం వంటి తీవ్రమైన ఉల్లంఘనలకు తగ్గింపు నిర్ణయం వర్తించదని అల్ నుయిమి వివరించారు. తీవ్రమైన ఉల్లంఘనలలో గంటకు 80 కి.మీ కంటే ఎక్కువ వేగ పరిమితిని అధిగమించడం, లైసెన్స్ లేకుండా వాహనంలో మార్పులు చేయడం, సిగ్నల్ జంప్ లాంటివి కూడా ఉన్నాయన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







