తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు మృతి
- November 13, 2022
తెలంగాణ: సూర్యాపేట జిల్లా మునగాల సమీపంలో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా , మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. శనివారం రాత్రి మునగాల మండల కేంద్రానికి చెందిన పలువురు సాగర్ ఎడమకాలువ గట్టుపై ఉన్న అయ్యప్ప ఆలయంలో మహాపడిపూజ కార్యక్రమానికి హాజరయ్యారు. పూజ అనంతరం అర్ధరాత్రి 12 గంటల సయంలో ట్రాక్టర్‌లో తిరుగుపయాణమయ్యారు. అయితే యూటర్న్ అయప్ప ఆలయం నుంచి కిలోమీటరున్నర దూరం ఉండటంతో దూరాన్ని తగ్గించుకోవడానికి.. డ్రైవర్ ట్రాక్టర్‌ను హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రాంగ్‌రూట్‌లో తీసుకెళ్లాడు.
ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విజయజవాడ వైపు వెళ్తున్న లారీ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మరణించగా, మరొకరు హాస్పటల్ లో మృతిచెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రగాయాలైనవారిని ఖమ్మం, సూర్యాపేటలోని హాస్పిటళ్లకు తరలించగా, స్వల్పంగా గాయపడినవారికి కోదాడ ప్రభుత్వ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. మృతులను తన్నీరు ప్రమీల, చింతకాయల ప్రమీల, ఉదయ్ లోకేష్, నారగాని కోటయ్య, గండు జ్యోతిగా గుర్తించారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో సుమారు 38 మంది ఉన్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు







