సిరియా మిలిటరీ ఎయిర్ బేస్‌పై మిసైల్స్‌తో ఇజ్రాయెల్ దాడి
- November 14, 2022
ఇజ్రాయెల్: సిరియా పై ఇజ్రాయెల్ మిస్సైల్ తో విరుచుకుపడింది. ఆదివారం (నవంబర్,2022) సిరియాలోని హామ్స్ ప్రావిన్సులో ఉన్న షరియత్ మిలిటరీ ఎయిర్ బేస్ పై క్షిపణులతో దాడి చేసిందని..ఇజ్రాయెల్ దాడులతో తమ ఎయిర్ బేస్ స్వల్పంగా ధ్వంసమయిందని సిరియా మిలటరీ వెల్లడించింది. ఈ దాడుల్లో ఇద్దరు సైనికులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
హామ్స్ నగరానికి ఆగ్నేయంగా ఉన్న విశాలమైన ఎయిర్ బేస్ రన్ వేని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది. ఈ విమానాశ్రయాన్ని కొంత కాలంగా ఇరాన్ వైమానిక దళం ఉపయోగించుకుంటోంది. ఈ కారణంగానే ఇజ్రాయెల్ దాడి చేసినట్లుగా సమాచారం. ఇజ్రాయెల్ రెండు నెలల క్రితం సిరియా రాజధాని డమాస్కస్ పై దాడి చేసింది. ఇంటెలిజెన్స్ కార్యాలయాలు, అత్యున్నత ర్యాంకులు కలిగిన అధికారుల కార్యాలయాలే లక్ష్యంగా క్షిపణులను ప్రయోగించింది. ఆ దాడుల్లో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోగా… మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.
తాజా వార్తలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత







