బిగ్‌బాస్ డబుల్ ట్విస్ట్.! ఇద్దర్ని బయటికి పంపించేశాడహో.!

- November 14, 2022 , by Maagulf
బిగ్‌బాస్ డబుల్ ట్విస్ట్.! ఇద్దర్ని బయటికి పంపించేశాడహో.!

బుల్లితెర మెగా గేమ్ షో బిగ్‌బాస్ 70 రోజులు పూర్తి చేసుకుంది. లేటెస్ట్ ఎపిసోడ్‌లో భాగంగా ఎలిమినేషన్‌కి సంబంధించి ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. 
డబుల్ ఎలిమినేషన్ పేరు చెప్పి, ఇద్దరిని హౌస్ నుంచి బయటికి పంపించేశాడు. ఒకరు బాలాదిత్య కాగా, మరొకరు వాసంతి. హౌస్‌కి పెద్దగా, పెదరాయుడి పాత్ర పోషించిన బాలాదిత్యను ఎలిమినేట్ చేయడం నిజంగా షాకింగ్ అంశమే. టాప్ 3లో బాలాదిత్య వుంటాడని అనుకున్నారంతా.
కానీ, గీతూ రాయల్‌తో బాలాదిత్య గొడవ ఎపిసోడ్‌తోనే ఆయనను హౌస్ నుంచి పంపించేశారనే ఆరోపణలున్నాయ్. బయటికొచ్చిన బాలాదిత్య మాత్రం ఆ ఇష్యూకి ఎలిమినేషన్‌తో ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చాడు.
అలాగే, బిగ్‌బాస్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న వాసంతి కూడా హౌస్ నుంచి వెళ్లిపోవడంతో హౌస్‌లో కాస్త గ్లామర్ తగ్గిందనే చెప్పాలి. 10 మంది కంటెస్టెంట్లతో ప్రస్తుతం హౌస్ రన్ అవుతోంది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com