రాధిక గురించి షాకింగ్ విషయం చెప్పిన వరలక్ష్మి శరత్ కుమార్.!
- November 14, 2022
విలక్షణ పాత్రలతో ప్రస్తుతం నటిగా తనదైన గుర్తింపు తెచ్చుకుంటున్న ముద్దుగుమ్మ వరలక్ష్మి శరత్ కుమార్. తమిళంలో మొదట హీరోయిన్గా పలు చిత్రాల్లో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా, డిఫరెంట్ రోల్స్ సెలెక్ట్ చేసుకుంటోంది.
నెగిటివ్ పాత్రలు కూడా వున్నాయ్ అందులో. తాజాగా సమంత నటించిన ‘యశోద’ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ నెగిటివ్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. ఇటీవలే రిలీజైన ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా ధియేటర్లలో సందడి చేస్తోంది.
మరోవైపు సినిమాని ప్రమోట్ చేసే పూర్తి బాధ్యతను వరలక్ష్మి శరత్ కుమార్ తీసుకున్న సంగతి కూడా తెలిసిందే. సమంత అనారోగ్యం కారణంగా ఆ బాధ్యతను తన భుజాలపై వేసుకుంది వరలక్ష్మి.
ఈ నేపథ్యంలోనే సినిమా ముచ్చట్లతో పాటూ, తన పర్సనల్ ముచ్చట్లను సైతం మీడియోతో పంచుకుంటోంది వరలక్ష్మి శరత్ కుమార్. ఆమె సినిమాల్లో నటించడం మొదట తండ్రి శరత్ కుమార్‌కి ఇష్టం లేదట. కానీ, తల్లి మాత్రం సపోర్ట్ చేసిందట.
తల్లితో పాటూ, సవతి తల్లి అయిన రాధిక కూడా వరలక్ష్మిని ఎంకరేజ్ చేసిందట. అంతేకాదు, తండ్రిని ఒప్పించి తాను సినిమాల్లోకి రావడానికి రాధిక చేసిన హెల్ప్ చాలా గొప్పది అని వరలక్ష్మి చెబుతోంది. తండ్రికి రెండో భార్య అయినా రాధికతో తనకు మంచి స్నేహం వుందని వరలక్ష్మి ఈ సందర్భంగా చెప్పడం విశేషం.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







