గోల్డెన్ వీసా హోల్డర్లు.. 10 ఏళ్ల రెసిడెన్సీకి తల్లిదండ్రులను స్పాన్సర్ చేయవచ్చు
- November 14, 2022
యూఏఈ: యూఏఈలోని గోల్డెన్ వీసా హోల్డర్లు ఇప్పుడు వారి తల్లిదండ్రులకు 10 సంవత్సరాల రెసిడెన్సీ కోసం స్పాన్సర్ చేయవచ్చు. అక్టోబరు 3 నుంచి అమలులోకి వచ్చిన గోల్డెన్ వీసా పథకంలో ఇది ఒక భాగంగా ఉన్నది. అరేబియన్ బిజినెస్ సెంటర్‌లో ఆపరేషన్ మేనేజర్ ఫిరోసేఖాన్ సంబంధిత వివరాలను వెల్లడించారు. ఒక ప్రవాస ఉద్యోగి సంబంధిత ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ నిర్దేశించిన విధంగా ప్రతి పేరెంట్‌కి గ్యారెంటీగా డిపాజిట్ చెల్లించడం ద్వారా ఒక సంవత్సరం పాటు తల్లిదండ్రులను స్పాన్సర్ చేయవచ్చన్నారు. గోల్డెన్ వీసా హోల్డర్‌లకు చెల్లింపు నుంచి మినహాయింపు ఇచ్చారని, వారి సంబంధిత కాన్సులేట్‌లు జారీ చేసిన ప్రామాణిక పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని ఫిరోసేఖాన్ తెలిపారు. సాధారణంగా యూఏఈ రెసిడెన్సీ వీసా హోల్డర్లు కనీసం Dh20,000 నెలవారీ జీతం పొందినట్లయితే వారి తల్లిదండ్రులను స్పాన్సర్ చేయవచ్చన్నారు. అయితే, ఈ జీతం నిబంధనలు గోల్డెన్ వీసా హోల్డర్లకు కూడా వర్తించదని తెలిపారు. 10 సంవత్సరాల వీసా ధర Dh2,800, Dh3,800 మధ్య ఉంటుందని ఫిరోసేఖాన్ వివరించారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







